Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

8 గంటల పాటు గాల్లో చక్కర్లు.. ఢిల్లీకి తిరిగొచ్చిన శాన్‌ఫ్రాన్సిస్కో విమానం

Air India Flight Returns to Delhi After 8 Hours Mid Air
Advertisement
  • సాంకేతిక సమస్య కారణంగా చైనా గగతలం నుంచి వెనక్కి మళ్లిన విమానం
  • సాంకేతిక సమస్యను పరిష్కరించేందుకు చర్యలు చేపట్టినట్లు వెల్లడి
  • ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చేందుకు ప్రయత్నిస్తున్నామన్న ఎయిరిండియా
Advertisement
230 మంది ప్రయాణికులతో శాన్‌ఫ్రాన్సిస్కో వెళుతున్న ఎయిరిండియా విమానం, ఎనిమిది గంటలకు పైగా గాలిలో ప్రయాణించిన తర్వాత ఢిల్లీకి తిరిగి వచ్చింది. సాంకేతిక సమస్య కారణంగా ఆ విమానం చైనా గగనతలం నుంచి ఢిల్లీకి తిరిగివచ్చింది. విమాన సంస్థ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, ఎయిరిండియాకు చెందిన బోయింగ్ 777-300 ఈఆర్ బుధవారం శాన్‌ఫ్రాన్సిస్కోకు బయలుదేరింది.

విమానం చైనా గగనతలంలో ఉండగానే సాంకేతిక లోపం తలెత్తడంతో 8 గంటలు గాల్లోనే చక్కర్లు కొట్టింది. ఆ తర్వాత అక్కడి నుంచి తిరిగి ఢిల్లీకి బయలుదేరింది. ఈ సాంకేతిక సమస్యను పరిష్కరించేందుకు చర్యలు చేపట్టినట్లు ఎయిరిండియా తెలిపింది. ప్రయాణీకులకు అసౌకర్యం కలిగినందుకు చింతిస్తున్నామని, వారిని సాధ్యమైనంత త్వరగా గమ్యస్థానాలకు చేర్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పారు.
Advertisement
Advertisement
Air India
Air India flight
San Francisco
Delhi
technical issue
China airspace
Boeing 777-300ER

More Telugu News